డి పి ఆర్ ఓ మామిండ్ల దశరథం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జర్నలిస్ట్ దాసరి శిరీష కు ఆత్మీయ సత్కారం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చి 8. (జనంసాక్షి). జర్నలిస్టులు మానవీయ కథనాలతో సామాజిక విలువలు పెంపోదేల చేయాల్సిన అవసరం ఉందని డిపిఆర్ఓ మామిండ్ల దశరథం అన్నారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జర్నలిస్ట్, సిరిసిల్ల ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యురాలు దాసరి శిరీషను ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా డి పి ఆర్ ఓ మామిండ్ల దశరథం మాట్లాడుతూ పోటీ పోటీ ప్రపంచంలో నిలబడి జర్నలిస్టుగా ఎదిగి వచ్చిన దాసరి శిరీషను అభినందించారు. వేరుగా అయ్యప్ప డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల్లో దాసరి శిరీషను ఆత్మీయంగా సత్కరించారు. కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కళాశా ప్రిన్సిపాల్ డైరెక్టర్ శ్రీనివాస్, నేరళ్ల రమేష్, అధ్యాపక బంధం విద్యార్థులు పాల్గొన్నారు.




