జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
జహీరాబాద్ ఆగస్టు 21 (జనంసాక్షి) జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఇండస్ట్రియల్ చైర్మన్ బాలమల్లు, మాజీ ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ లు అన్నారు. శనివారం స్థానిక పస్తాపూర్ జర్నలిస్ట్ కాలనీ లో జర్నలిస్ట్ ల కాలనీ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొని కేక్ కట్ చేసి వార్షికోత్సవం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిది అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం వంద కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు, ఆర్ డి ఓ రమేష్ బాబు, డిఎస్పి శంకర్ రాజ్, అర్టీఓ యశ్వంత్ కుమార్, వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు వివిధ పత్రికల జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.