సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ప్రమాణ స్వీకారోత్సవ సభలో మంత్రి కేటీఆర్.రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 06.(జనంసాక్షి). జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఐటి ,మున్సిపల్ , భారీ పరిశ్రమల శాఖ, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సోమవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ పాలకవర్గం ప్రమాణ స్వీకరోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన పాలకవర్గం చేత ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ సంక్షేమం కోసం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్ సిరిసిల్లలో అర్హులైన జర్నలిస్టులు కొందరికి నివేశన స్థలాలు రాలేదని వారందరికీ ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. తక్షణం స్పందించిన మంత్రి కేటీఆర్ ఎవరైనా ఇంకా నివేశన స్థలాలు రాని అర్హులైన విలేకరులు ఉంటే అందరికీ నివేషన స్థలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాప్కబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, తెలంగాణ పవర్ లుమ్ టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ జింధం కళ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, డి పి ఆర్ ఓ మామిండ్ల దశరథం,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి. జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ప్రెస్ క్లబ్ కార్యదర్శి పరకాల ప్రవీణ్ గౌడ్, ఉపాధ్యక్షులు అంకితం రఘువీర్, కోశాధికారి కాయితి మహేందర్, సహాయ కార్యదర్శి రాపేల్లి భాస్కర్, కార్యవర్గ సభ్యులు దాసరి శిరీష, ఆల్లె రమేష్, జాన దయానంద్, ఆన్సర్ అలీ, నాయిని బాబు, జక్కని రాజా రమేష్, సీనియర్ జర్నలిస్టులు కాంభోజ ముత్యం, మల్లికార్జున్, టివి నారాయణ, రాచ లక్ష్మణ్, పాలమకుల శేఖర్, మిట్టపల్లి కాశీనాథ్, పలువురు ప్రజా ప్రతినిధులు జర్నలిస్టులు పాల్గొన్నారు.




