Wednesday, 4 November 2026

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు తక్షణం పరిష్కారం చూపాలి

.

 

 

 

 

అదనపు కలెక్టర్ ఖిమ్య నాయక్.రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్06.(జనంసాక్షి). ప్రజావారిలో వచ్చిన ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి వేదికగా భావిస్తున్న ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో పలు సమస్యలపై 40 దరఖాస్తులు వచ్చినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో. గంగయ్య ప్రభుత్వ శాఖల అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.