Wednesday, 4 November 2026

జర్నలిస్టుల సభ పోస్టర్ ఆవిష్కరణ

జర్నలిస్టుల సభ పోస్టర్ ఆవిష్కరణ

యాదాద్రి జిల్లా తుర్కపల్లి జనంసాక్షి న్యూస్ జనవరి07 /22:

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరగబోయే టియుడబ్ల్యూజె(హెచ్-143)
రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ను శనివారం తుర్కపల్లి మండల కేంద్రంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జూకంటి అనిల్,జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్,ప్రజాపక్షం జిల్లా స్టాపర్ దుడుక రామకృష్ణలు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కొరకు,సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ లో జరగబోయే మహాసభల్లో జిల్లా జర్నలిస్టులు అధికసంఖ్యలో పాల్గొని సభలు విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.ఈ పోస్టర్ ఆవిష్కరణలో టియుడబ్ల్యూజె(హెచ్-143) జిల్లా యూనియన్ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ కందుల శ్రీనివాస్ రావ్,
చెన్ రాజు శేఖర్,బట్టు సూర్యంరాజు,
పెండెం రవి,చాంద్ పాషా,కొండల్,ఏశాల కృష్ణ, పల్లె నరేష్ గౌడ్,తునికి శ్రీనివాస్, పాముల మహేందర్ గౌడ్,కొండం నాగరాజు గౌడ్, జీవిలికపల్లి మహేష్, తదితరులు పాల్గొన్నారు.