.జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కై చలో ఢిల్లీ కరపత్రం విడుదల.-సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తూ జర్నలిస్టులకు భద్రత కల్పించాలి.-తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ మాదిగ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి 30(జనంసాక్షి): జర్నలిస్టులపై జరుగుతున్న వేధింపులు, దాడులను నివారించేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వాలు అమలు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 6న తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి మాదిగ, మాదిగ ఉపకులాల జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ పిలుపునిచ్చాడు.సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఒక ఒక ప్రైవేట్ ఆవరణంలో మాదిగ,మాదిగ ఉప కులాల జర్నలిస్టుల అధ్యర్యంలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుల నాగేంద్రం హాజరై మాట్లాడుతూ వృత్తి నిర్వహణలో అవినీతి, అక్రమాలు, భూకాబ్జాలకు సంబంధించిన వార్తలు రాస్తున్న జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ బెదిరింపులు,దాడులకు దిగుతున్నారని ఇలాంటి దాడులను తిప్పి కొట్టాలని ఆయన డిమాండ్ చేశారు.సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జర్నలిస్టులపై అక్రమ కేసులు వేధింపులు నిజాలు రాస్తున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చొరువ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఫిబ్రవరి 6వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మాదిగ, మాదిగ ఉప కులాల ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కై చేపట్టిన ఒక రోజు నిరసన దీక్షకు నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న మాదిగ,మాదిగ ఉపకులాలు తరలివచ్చి నిరసన దీక్షను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్ళపల్లి రాజేందర్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటేపాగ హుస్సేన్, పానుగంటి సురేందర్,రాష్ట్ర కార్యదర్శి అంకగళ్ల కర్ణాకర్,రవీంద్ర ప్రసాద్,సిటిజన్ న్యూస్ సీఈవో గంధం రవికుమార్,టి మీడియా స్టాప్ రిపోర్టర్ శ్యామ్ మాదిగ, మాదిగ,ఉపకులాల జర్నలిస్టులు పాల్గొన్నారు.




