Tuesday, 3 November 2026

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు.

.
–

 

 

 

 

 

 

-టిపి సిసి డెలిగేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్

భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ వద్ద ముఖ్యఅతిథి పిసిసి డెలిగేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్ పాల్గొని మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా చేసుకుని అఖండ భారతావని స్వాతంత్రానికి పోరాటం చేశారన్నారు. ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శిపిట్టల బాలరాజ్ బిీసుకుంటా సత్యనారాయణ లాహుద్దీన్ ఫయాజ్ స్థానిక కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అజారుద్దీన్, మహమ్మద్ రఫీక్,మరియు రషీద్, నరసింహ సురేష్ తదితరులు పాల్గొన్నారు.