యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్ మే03తుర్కపల్లి సమావేశంలో మాట్లాడుతున్న షానూర్జర్నలిస్టుల హెల్త్ కార్డులపై కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించాలని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ చానూర్ డిమాండ్ చేశారు .గురువారం తుర్కపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అన్ని కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రభుత్వం జారీ చేసిన జర్నలిస్టులకు హెల్త్ కార్డుల పై ఉచిత వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రస్తుతం కొన్ని ఆసుపత్రిలో హెల్త్ కార్డులను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అన్ని కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యులు పసుల నరసింహ, తుర్కపల్లి మండల అధ్యక్షుడు షేక్ బురాన్ , ఉపాధ్యక్షుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.




