డోర్నకల్ మే/ 4/ జనం సాక్షి న్యూస్:ఇంకా ఎన్నికల నగారానే మోగలేదు.. అప్పుడే రాజకీయం హద్దులు దాటుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా డోర్నకల్ ఎలక్షన్ ఇంకా రాకముందే నువ్వా-నేనా అన్నట్టు వాడి-వేడిగా సాగుతోంది.మాటల మంటలు రేపుతూనే.. చేతలకూ దిగుతున్నారు ప్రత్యర్థులు.తాజాగా, డోర్నకల్ మండలంలోని గొల్లచెర్ల గ్రామంలో గత 40 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గద్దెను వెంకటనారాయణ ఆధ్వర్యంలో నిర్మించారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో డోర్నకల్ పిఎసిఎస్ చైర్మన్ చేరెడ్డి బిక్షం రెడ్డి గ్రామ పంచాయతీ వర్కర్లతో గ్రామ సచివాలయం చుట్టూ పరిసరాలను శుభ్రం చేసే క్రమంలో ఇట్టి కాంగ్రెస్ గద్దెను కూల్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇన్నాళ్లూ విమర్శలు, ఆరోపణలకే పరిమితమైన వైరి వర్గాలు.. ఇప్పుడిలా జెండా గద్దె కూల్చే వరకూ రావడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. తమ పార్టీ జెండా గద్దె కూల్చడంపై.. స్థానిక కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఇట్టి విషయంపై గొల్ల చర్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు డోర్నకల్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గురువారం ఉదయం డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జాటోత్ రాంచందర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలసి గొల్లచర్ల పర్యటించి కూల్చిన గద్దెను పరిశీలించి కూల్చిన వారిపై కఠిన చర్య తీసుకోవాలని సిఐ ని వారు కోరారు.అదేవిధంగా గద్దె కుల్చిన చోటనే మళ్లీ పునర్ నిర్మించేందుకు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు వెంకన్న, డాక్టర్ రామచంద్రనాయక్ తో కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డి, డోర్నకల్ మండల అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ యాదవ్, మండల నాయకులు పగిడి పాల వెంకటేశ్వర్లు, కాసం శేఖర్,బాణోత్ రామునాయక్, గ్రామ అధ్యక్షుడు బస్వ నాగయ్య, పట్టణ పర్యవేక్షకులు యాల్లావుల హరికృష్ణ, కొండపల్లి కరుణాకర్ రెడ్డి, డీజే శ్రీనివాస్, గుండుబాబు,రాము,వెంకన్న,ప్రవీణ్,దేవుసింగ్, జరుపుల బంటి, భూక్యా శ్రీను, ఉప సర్పంచ్ శ్రీను, ఉడుగుల వెంకన్న, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.




