మహబూబాబుద్బ్యూరోమే23(జనంసాక్షి)మహబూబాబాద్ జిల్లాలో జర్నలిస్ట్ లందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించి, పక్క ఇండ్లు నిర్మించి ఇవ్వలని గార్ల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు తాళ్ళ పల్లి కృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జర్నలిస్ట్ లు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అలాంటి వారికి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని నూతన జిల్లా మహబూబాబుద్ పక్క జిల్లా ఖమ్మంలో 23 ఎకరాలు స్థలం కేటాయించిన పద్ధతిలో మహబూబాబాద్ జిల్లా లో గల జర్నలిస్టు లందరూ పేద మధ్యతరగతి వారని జిల్లాలో గల జర్నలిస్ట్ అందరికి స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇ వ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలోజాతీయ శ్రీ శక్తి అవార్డ్ గ్రహీత శ్రీమతి సంసద్ బేగం, గార్ల మండల మాజీ ఎంపీపీ ఎంపీటీసీ మలోట్ వెంకట్ లాల్, గార్ల ఎంపీటీసీ 2 సుజాత రామారావు, నాని గౌడ్, బపాన్ పల్లి సుందర్ భవ్ సింగ్, బీముడు నాయక్, గుగులిత్ హారి, పళ్ళ నర్సయ్య, అస్మాట్ రాము తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టు లకు ఇండ్ల స్థలాలు,డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలి.




