Thursday, 5 November 2026

జలహారం పనుల కోసం కోటి విడుదల

హైదరాబాద్‌,ఫిబ్రవరి20 ( జ‌నంసాక్షి)
:  జలహారం పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డబ్బుతో 21 డివిజన్లలో నమూనా అంచనాల రూపకల్పన, భూసేకరణ జరుపుతారు. ఆర్‌ అండ్‌ బీ, అటవీ, విద్యుత్‌ శాఖల చెల్లింపునకు ఈ నిధులు వినియోగిస్తారు.జీహెచ్‌ఎంసీ పరిధిలోని భూకబ్జాల క్రమబద్ధీకరణ అంశాల పరిశీలనకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు ఐఏఎస్‌ అధికారుల పరిశీలకులుగా నియామితులైయ్యారు. రాజేశ్వర్‌తివారీ, సునీల్‌శర్మ, హరిప్రీత్‌సింగ్‌, ఆర్వీ చంద్రవదన్‌, అహ్మద్‌నదీం లు కమిటీ సభ్యులుగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *