రాజన్న సిరిసిల్లబ్యూరో. జనవరి 21.(జనం సాక్షి). జిల్లా లో మానేరు పరివాహ ప్రాంతాల్లో శనివారం మాఘమాస జాతర్ల సందడి నెలకొంది. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మానేరు తీరంలో గంగాభవాని ,మడేలేశ్వర జాతరలు జరుగుతున్న విషయం తెలిసిందే. జాతర కోసం సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలివస్తుంటారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రత్యేక కార్యచరణను ఎన్నుకున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు మానవ శరీర నిర్మాణం ఇతర సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించి విజ్ఞానాన్ని అందించేందుకు జాతరలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చకినాల శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అగస్త్య ఫౌండేషన్, విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతరలో విద్యార్థుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.




