రాజంపేట్ జనవరి 20 జనంసాక్షి
రాజంపేట్ మండల కేంద్రంలోని శుక్రవారం వ్యవసాయ అధికారులు పంట పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా కామారెడ్డి డివిజన్ వ్యవసాయ సంచాలకులు అపర్ణ మాట్లాడుతూ వరి పంట లో వాతావరణం మార్పుల వల్ల ముగి పురుగు పంటను ఆశిస్తుందని ముగి పురుగు నివారణకు రైతులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు విప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు మరియు యాసంగి పంట కాలంలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు మరియు మెళకువలు రైతులకు వివరించడం జరిగింది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, చెరకు, కూరగాయ పంటలను పరిశీలించారు. రైతుల పొలాల్లో అక్కడక్కడ వరి మొక్కలు గుంపులు గుంపులుగా బాగా పెరిగిన పంట మొత్తము పసుపు వర్ణంలోకి మారిపోవడం అక్కడి నేలలో ఉన్న గంధకపు దుష్ప్రభావం వల్ల సంభవించును. ఇటువంటి ప్రాంతాలలో మట్టి మెత్తగా కాలు చాలా లోతుగా దిగబడును, పొలంలో నడుస్తుంటే బుడగల రూపంలో గాలి బయటకు వస్తుంది, నివారణకు మురుగునీటిని తీసివేసి స్వచ్ఛమైన నీటిని పొలానికి అందించాలి, అలాగే పొలాన్ని నెర్రలు వచ్చే విధంగా ఆరబెట్టి వేర్లకు గాలి తగిలేలా చూసి మళ్లీ పొలానికి నీరు అందించాలి అప్పుడు సల్ఫైడ్ దుష్ప్రభావం తగ్గును అని సూచించారు. మండలవ్యవసాయ అధికారిణి జ్యోత్న్స ప్రియదర్శిన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో అక్కడక్కడ వరి నాటిన 15 నుంచి 20 రోజుల మధ్య కాలంలో వరి పంటపై మోగి పురుగు గాయ లక్షణాలు గమనించడం జరిగింది కావున ముందస్తుగా రైతులు విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని నారుమడికి వినియోగించాలి అలాగే పంటలు గాయ లక్షణాలు గమనించిన వెంటనే నివారణకు ఎకరానికి 10 కిలోల కార్బోపురాన్ 3G గుళికలను లేదా కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 50 SP అనే మందును లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి పొలమంతా సమానంగా పిచికారీ చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు కుమ్మరి బిక్షపతి, సాయిలు, రాజు, రాజంపేట్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీకాంత్ పాల్గొన్నారు. .




