Wednesday, 4 November 2026

పత్యేక ¬దా కోసం కార్యాలయాల ముట్టడి

కాకినాడ,మార్చి9(జ‌నంసాక్షి): ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 11న జిల్లాలోని అన్ని కేంద్ర కార్యాలయాలను ముట్టడించనున్నట్టు సీపీఐ ప్రకటించింది. దీనిపై పోరాటం చేస్తామని అన్నారు. ఈ మేరకు తాము ఆందోళనకు దిగుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మదు తెలిపారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో భాగంగా జిల్లాలోని కేంద్ర కార్యాలయాలు, సంస్థల ఎదుట ధర్నా, పికెటింగ్‌లు చేపట్టనున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.100 కోట్లు ఏ మేరకు చాలవన్నారు. ఏటా రూ.6 వేల కోట్ల అంచనా వ్యయం కాగా వంద కోట్లు కేటాయించటం సిగ్గుచేటన్నారు. జిల్లాలో నర్సాపురం- కోటిపల్లి రైల్వేలైను ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. ఈనెల 25 నుంచి 29 వరకు పాండిచ్చేరిలో సీపీఐ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *