Tuesday, 3 November 2026

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

నిజామాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): తమకు సౌకర్యలు కల్పిస్తే క్రీడల్లో ఎంతటి ప్రతిభనైనా చూపించే సత్తా ఉందని జిల్లా క్రీడాకారులు మరోసారి రుజువు చేశారు. ఇప్పటికే జిల్లాకు క్రీడల్లో మంచి పేరుంది. యెండల సౌందర్య, నిఖత్‌ జరిన్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి జిల్లాకు పేరు తెచ్చారు. అలాగే పలువురు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయిలో చక్కని ప్రతిభ కనబర్చారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌ వంటి క్రీడల్లో ప్రతిభ కనబరిచారు. త్రోబాల్‌ క్రీడలోనూ జిల్లా క్రీడాకారులు ప్రతిభచూపారు. జాతీయ స్థాయిలో ఎంపికయ్యారు. బోర్గాం(పి) జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి వినోద్‌కుమార్‌ బాలుర జట్టుకు ఎంపికయ్యారు. పూజిత అనే విద్యార్థిని బాలికల జట్టుకు ఎంపికయ్యారు. వారిని పలువురు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *