కంటోన్మెంట్ జనం సాక్షి మే 12 బోయిన పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ ఆన్లైన్ క్విజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ సిప్లిగంజ్,టిపిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి, భారతదేశ విముక్త పోరాటానికి దేశాన్ని ఏకం చేస్తూ ముందుకు సాగిన మహాత్మా గాంధీ ఎందరో మహానుభావులు పుణ్యమే నేడు భారతదేశ లో ప్రజాస్వామ్యం లభించిందని ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర కరిష్మా అంటూ రేవంత్ రెడ్డి వెల్లడించారు. బిజెపి నాయకులు కాంగ్రెస్ 50 ఏళ్ల పరిపాలనలో ఏమి చేయలేదంటూ పలు వేదికలపై ఆరోపిస్తున్న బిజెపి నాయకులు సంకల గుద్దుకుంటూ దేశాన్ని మేమే డిజిటల్ వైపు నడిపిస్తున్నామని పేర్కొనడం ఇంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చరిత్ర తెలియని బిజెపి నాయకులకు మరోసారి జాతీయ రాజకీయ శిక్షణా కేంద్రం వేదిక గా వేసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 1984లోనే సాంకేతిక పరిజ్ఞానానికి పురుగు పోసిన దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని వెల్లడించారు.విషయం తెలియక గల్లి ఢిల్లీ భాజ భజవ అంటూ నాయకులు ప్రసంగాలతో ఓరేస్తిస్తున్నారు, ఈ బిజెపి నాయకులు.ఈనెల సరూర్ నగర్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ యూత్ డెకరేషన్ ని ప్రసంగించిన విషయం మన అందరికీ తెలిసిందే, అదే విషయాన్ని ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతని నిద్రలేపుతూ వారి పరిజ్ఞానానికి పరీక్ష పెడుతూ క్రీడా పోటీని తట్టుకొని నిలబడటానికి ఆన్లైన్ క్విజ్ కార్యక్రమాన్ని పరిచయం చేసారు. ఈ పోటీకు 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీలకు అర్హులని అలాగే రిజిస్ట్రేషన్ నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుందని,
అలాగే జూన్1 చివరి తేదీగా ప్రకటించారు, రిజిస్ట్రేషన్ వెబ్ లింకుతో కూడిన ఎస్ఎంఎస్ పొందుటకు మిస్ కాల్ ఇవ్వాల్సిన నెంబర్ 7661 899 899, జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గా సందర్భంగా క్విజ్ అర్హులైన లబ్ధిదారులకు మొదటి బహుమానంగా లాప్ టాప్,రెండో బహుమతి గా స్మార్ట్ ఫోన్, మూడో బహుమతిగా టాబ్లెట్,ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా టాపర్లకు ప్రత్యేకమైన బహుమతి అంటూ ఎలక్ట్రికల్ స్కూటీ అందజేస్తామని ఈ సందర్భంగా వివరించారు.తెలంగాణ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ఆస్కా అవార్డు గ్రహీత.రాహుల్ సిప్లిగంజ్ నీ అవమానించినందుకు టీ కాంగ్రెస్ పార్టీ తరఫున పది లక్షల రూపాయలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనకు అందజేయుచున్నారు.అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీ కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత కోటి రూపాయల నజరానా,స్పోర్ట్స్ లెజెండర్ గా ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఏనుముల రేవంత్ రెడ్డి తెలియజేశారు.
రాహుల్ సిప్లగంజ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీలు ప్రారంభించడం యూత్ ను ఎంకరేజ్మెంట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమానికి తనను ముఖ్యఅతిథిగా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి సభ అధ్యక్షుడు మన్నె సతీష్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్ ఠాగూర్, ఎన్.ఎస్.యు.ఐ జాతీయ అధ్యక్షుడు నీరజ్ కుందన్, జాతీయ కోఆర్డినేటర్ దాసరి రాజు అజయ్ కుమార్, డాక్టర్ మల్లు రవి,అద్దంకి దయాకర్, ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్,మహిళ అధ్యక్షురాలు సురభి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నవీన్, రోహిత్ రెడ్డి,అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




