Thursday, 5 November 2026

జింఖానా మైదానంలో దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మర్రి రాజశేఖర్ రెడ్డి

 

 

 

 

 

 

 

కంటోన్మెంట్ జనం సాక్షి మే13 సికింద్రాబాద్ జింఖానా మైదానంలో దుబాయ్ సింగపూర్ నగరాలను తలపించే విధంగా మోడల్స్ ను నిర్మించి సరికొత్త ప్రదర్శనకు వేదికగా నిలిచింది. దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్ పేరిట సికింద్రాబాద్ జింఖానా మైదానంలో 50 రోజులపాటు వివిధ రకాల ప్రదర్శనలు,కొనుగోల్లు,స్టాళ్లను ఏర్పాటు చేశారు.దుబాయ్ సింగపూర్ లండన్ నగరాలలో ఉన్న ప్రముఖ చారిత్రాత్మక నిర్మాణాల నమూనాలను సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసి వీక్షకులకు కనువిందు చేశారు.మల్కాజ్గిరి పార్లమెంటరీ ఇంచార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి,దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతుర్లు లాస్య నందిత,నివేదిత లు మాజీ బోర్డు సభ్యులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉందని కొనియాడారు. షాపింగ్ నిమిత్తం వస్త్రాలు వివిధ రకాల వస్తువులను అందుబాటులో ఉంచడంతో పాటు దృష్టిలో ఉంచుకొని చిన్నారులకు ఆట వస్తువులు తినబండారాలను ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు.ప్రతి ఒక్కరూ వేసవి సెలవులలోఈ ఎగ్జిబిషన్ను తిలకించాలని నిర్వహకులు కోరారు.