జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (5): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సోమవారం జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ మంజుల మాట్లాడుతూ కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి డిసెంబర్ ఆరవ తేదీ నుండి 22వ తేదీ వరకు గుర్తించనున్నట్లు ఆమె తెలిపారు కుష్టి వ్యాధి లిప్రే బ్యాసిలష్ బ్యాక్టీరియా వలన వస్తుందని ఈ యొక్క వ్యాధి లక్షణాలు స్పర్శ లేని మచ్చలు చర్మం పైన ఎర్రని గోధుమ రంగు ముద్దు బారిన మచ్చలు ఉంటే కుష్టి వ్యాధిగా గుర్తించి వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని వారన్నారు కుష్టి వ్యాధి ఒక సామాన్యమైన వ్యాధి కుష్టి వ్యాధి వంశపారపర్యం కాదు ఎవరికైనా రావచ్చు ఈ వ్యాధి అంటే ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదన్నారు కుష్టి వ్యాధిని తొలి దశలో గుర్తించి మందులు వాడితే పూర్తిగా నయం అవుతుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో నందీశ్వర్, ఆరోగ్య విస్తరణ అధికారి సురేష్ కుమార్, సూపర్వైజర్ సుచిత్ర, కౌసల్య, వైద్య సిబ్బంది మధుబాబు జ్ఞానేశ్వర్ శాంతిభూషణ్, వెంకటమ్మ, సుమిత్ర, నాగమణి, శోభ, లక్ష్మి, పద్మావతి, విజయలత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




