దారి కోసం తహసిల్దార్ విచారణ
రాజాపేట, డిసెంబర్5 ( జనం సాక్షి): రాజపేట మండలంలోని పిట్టలగూడెం వారికి గ్రామస్తులకు రోడ్డు సౌకర్యం లేదని ధర్నా నిర్వహించినారు. వాటి విషయమై గ్రామానికి వెళ్ళిన తహసిల్దార్ రవికుమార్ విచారణ చేపట్టారు. విచారణ చేసి ,రహదారికి అభ్యంతరం తెలిపిన వారిని ఒప్పించి, రహదారి సరి చేయుటకు ఉన్న ఆటంకాలని తొలగించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పిటిసి Ch. గోపాల్, విజిలెన్స్ కమిటీ మెంబర్ భాస్కర్, మాజీ సర్పంచులు, నరేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




