–
–గుండు మనీష్ గౌడ్ భువనగిరి టౌన్ (జనం సాక్షి):–భువనగిరి 27/ జనవరి / యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించిన అనంతరం జాతీయ గీతాలాపనా చేయడం జరిగింది. అంతకుముందు గ్రామ ముఖ ద్వారం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల , మహిళా భవనంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ , ఉప సర్పంచ్ నీల పోశెట్టి గౌడ్, కో ఆప్షన్ సభ్యులు కళ్లెం కృష్ణ , బిఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి జక్కుల చంద్రయ్య , మాజీ సర్పంచ్ రసాల నర్సింహ యాదవ్ , బబ్బురి యాదగిరి , కోట చంద్రశేఖర్ (సీఎం) , కోట లక్ష్మయ్య , కోట పెద్ద స్వామి , ముద్దసాని ఉపేందర్ , బబ్బురి సురేష్ , చిన్న సురేష్ , సాగర్ , నోముల నరసింహ యాదవ్ , గ్రామ కార్యదర్శి ఆమని తదితరులు పాల్గొన్నారు.




