అయిజ, మార్చ్ 24 (జనం సాక్షి) : కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అభివృద్ధి కోసం పోటీలు నిర్వహించగా అయిజ మండలలో 28 పంచాయతీలు ఉండగా వాటిలో 19 గ్రామ పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎన్నిక చేయడం జరిగింది. ఎంపీడీవో సాయి ప్రకాష్,తెలిపారు.ఈ నేపథ్యంలో మండల పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ పంచాయతీ అవార్డు ల ఎంపికైన సందర్భంగా సర్పంచ్ లకు మరియు పంచాయతీ సెక్రటరీ లకు. ఇంచార్జ్ ఎంపీపీ నాగేశ్వర రెడ్డి, హాజరై వారి కి సన్మానం చేసి ప్రశంస పత్రాల అవార్డుల ప్రధానోత్సవం అందజేశారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఎంపి టి సి లు , సర్పంచ్ లు, ఎంపిఓ నరసింహ రెడ్డి, పంచాయతీ కార్యదర్శిలు తదితరులు పాల్గోన్నారు.




