హైదరాబాద్,చాంద్రాయణగుట్ట మండలంలోని పల్లె చెరువుకు గండి పడటంతో బండ్లగూడ, మైలార్‌దేవ్‌పల్లి రోడ్డుపై వరద నీరు వచ్చింది. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరువు నుంచి వచ్చిన నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు.




