హైదరాబాద్ : ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులపై అధ్యయనం చేస్తున్న కమిషన్ నేడు, రేపు మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది. నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి… మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌లో ముస్లింల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించి… ప్రజాభిప్రాయ సేకరణ జరుపనున్నారు. అదే విధంగా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకుంటారు.




