Wednesday, 4 November 2026

జాతీయ రహదారిపై 70 కోట్ల తో అండర్ పాస్ వే బ్రిడ్జి

– జాతీయ రహదారి 44 ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు…
కామారెడ్డి ప్రతినిధి మార్చి15 జనంసాక్షి;
జాతీయ రహదారి 44 పై 70 కోట్ల రూపాయలతో మూడు చోట్ల అండర్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని జాతీయ రహదారులు అధికార సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. బుధవారం నాడు కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. తన పరిధిలో బోయిన్పల్లి నుండి ఆదిలాబాద్ దాటిన తర్వాత మహారాష్ట్ర సరిహద్దు వరకు జాతీయ రహదారి 44 ఉంటుందని ఈ జాతీయ రహదారిపై కామారెడ్డి జిల్లా పరిధిలో మూడు చోట్ల 70 కోట్లతో అండర్ పాస్ వే బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. నరసనపల్లి బైపాస్ వద్ద, టేక్ రియల్ బైపాస్ వద్ద, పద్మావతి వాడి ఎక్స్ రోడ్ వద్ద 70 కోట్లతో అండర్ వాసవి విడుదలను నిర్మిస్తున్నామని పనులు ప్రారంభమయ్యాయని ఏడాది కాలంలోపు మూడు బ్రిడ్జిలు నిర్మిస్తామని జాతీయ రహదారుల అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.