హైదరాబాద్: భారతీయ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో యునెస్కోకు చెందిన మానవహక్కుల విభాగం పర్యవేక్షణలో పూణేలో ఈ నెలలో నిర్వహిస్తున్న మూడు రోజుల విద్యార్థి పార్లమెంట్‌కు తెలుగు నాడు విద్యార్ధి సమాఖ్య (తెనావిస) రాష్ట్ర అధ్యక్షులు ఈడిగ ఆంజనేయ గౌడ్‌కు ఆహ్వనం అందింది. దేశ వ్యాప్తంగా ప్రధాన రాజకీయ పార్టీల విద్యార్థి విభాగాలకు చెందిన 50 మంది నేతలు నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల పై విస్త్రృతంగా చర్చిస్తారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో అధికారి టీఎస్ శేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తేదేపా లక్ష్యాలను, కృషిని వివరిస్తానని చెప్పారు.




