శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్‌లోని నౌగమ్ సెక్టార్‌లోకి ప్రవేశించిన చొరబాటుదారులను సైన్యం నిరోధించింది. కుప్వారా జిల్లాలో చొరబాటు దారుల కదలికల గురించి సమాచారం అందుకున్న సైనిక అధికారులు అ ప్రాంతంలో గస్తీ నిర్వహించారు. కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారని సైన్య అధికార ప్రతినిధి నరేష్‌విజ్ తెలిపారు. ఈ ఘటనలో సైనికులు ఎవరూ గాయపడలలేదని అన్నారు. మిగిలిన చొరబాటుదారులు తప్పించుకున్నారని తెలిపారు.




