Thursday, 5 November 2026

జాతీయ సంఘాలను విమర్శించడం ఇప్పటికైనా మానుకోవాలి

జాతీయ సంఘాలను విమర్శించడం ఇప్పటికైనా మానుకోవాలి
-ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొరీమి రాజ్ కుమార్
యైటింక్లయిన్ కాలని జనవరి 06 (జనంసాక్షి):
జాతీయ సంఘాలను విమర్శించడం ఇప్పటికైనా మానుకోవాలని ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొరీమి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆర్జీ-2 పరిధిలోని వకీలుపల్లి మైన్ నందు ఏఐటియూసి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు.
సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఎల్. ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 11వ వేతన ఒప్పందం డిపిఈ గైడ్లైన్స్ ను పక్కనపెట్టి 19 శాతం సాధించడం కార్మికుల విజయమని ఆయన అన్నారు. 11 వ వేజ్ బోర్డ్ లో ఏఐటీయూసీ యూనియన్ పెద్దన్న పాత్ర పోషించిందని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మెరుగైన వేతన ఒప్పందం సాధించామని తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యపాత్ర పోషించిన ఏఐటియూసి ప్రధాన కార్యదర్శి, పర్మనెంట్ బోర్డ్ నెంబర్ కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్యకు కృతజ్ఞలు తెలిపారు. కోల్ ఇండియాలో ఉన్న 2.60 లక్షల మంది సింగరేణిలో ఉన్న 43వేల మందికి ప్రయోజనం చేకూరేలా ఈ వేతన ఒప్పందం సాధించామన్నారు. ముందు జరుగబోయే సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల హై పవర్ కమిటీ వేతనాలు , అలవేన్స్, ఇంక్రిమెంట్ తదితర విషయాలను ప్రస్తావించ నున్నారు. మనం ఎక్కడ సమ్మెకు దిగుతామోనని భయానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిపి గైడ్లైన్స్ ని పక్కన పెట్టి 19 శాతం మెరుగైన ఒప్పందాన్ని అంగీకరించిందన్నారు. ఇంత మంచి వేతన ఒప్పందం జరగడం ఓర్వలేని టీబీజీకేఎస్ నాయకులు జాతీయ సంఘాలను విమర్శించడం వారి దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి కందుకూరి రాజారత్నయ్య, బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ బి.అన్నా రావు, వకిల్ పల్లి ఫిట్ కార్యదర్శి బోట్ల సంపత్, రాజు, చోప్పరి శంకర్, కనకయ్య, శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు