రక్షణతో కూడిన ఉత్పత్తి సాధనకు కృషి చేయాలి
-ఉద్యోగులకు దిశానిర్దేశం
-గనిని సందర్శించిన జిఎం ఐత మనోహర్
యైటింక్లయిన్ కాలని జనవరి 06 (జనంసాక్షి )
ఆర్జీ-2 ఏరియా వకీల్ పల్లి గనిని శుక్రవారం ఏరియా జనరల్ మేనేజర్ ఎ.మనోహర్ సందర్శించారు.
ముందుగా గని ఆవరణలోని అమ్మవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి, గని పని స్థలాలను సర్వే మ్యాప్ ద్వారా పరిశీలించారు. ఎల్ హెచ్ డి, కంటిన్యుస్ మైనర్ బొగ్గు ఉత్పత్తిపై అధికారులతో సమీక్షించారు. ఆనంతరం గనిలోనికి దిగి డిప్లరింగ్ ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న క్రమములో గోఫ్ ఏరియాలో ఎయిర్ బ్లాస్ట్ వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా రక్షణ పరమైన చర్యలపైన ఆరా తీసి అక్కడ తీసుకోవలసిన చర్యలపైన అధికారులకు తగు సూచనలు చేశారు. సేఫ్టి మేనేజ్మెంట్ ప్లాన్ పైన ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ, ఉద్యోగులకు రక్షణ సూత్రాలఫై ఎలాంటి అవగాహన ఉన్నదనే విషయాలపై ఉద్యోగులతో మాట్లాడి రక్షణ సూత్రాల అవశ్యకతను వివరించారు. గత నెలలో వకీల్ పల్లి గని 145 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినందుకు ఉద్యోగులందరినీ అభినందించి ఇదే ఒరవడిని కొనసాగించాలన్నారు.
ఆయన వెంట ఏరియా రక్షణ అధికారి బి.రవీందర్ గని మేనేజర్ పీ. రవి కిరణ్, గ్రూప్ ఇంజినీర్ భీమానాతి చంద్రశేఖర్, సర్వే అధికారి అఫ్సర్ పాషా, సీనియర్ సెక్యూరిటీ అధికారి పివి.రమణ ,సంక్షేమాధికారి ఓంకారి బాబు తదితులున్నారు.




