హుజూర్ నగర్ ఫిబ్రవరి 13 (జనంసాక్షి): జాతీయ సంపదను కొందరు కార్పొరేట్ శక్తులు దొంగల్లా దోచుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంపదను కాపాడాల్సిన వాళ్లే దొంగలై వ్యాపారవేత్తకు దోచిపెడుతున్నారన్నారు. అదాని యవ్వారం బయటపడేసరికి జాతీయత పేరు చెప్పి కేంద్రం కొత్త నాటకానికి తెర లేపిందన్నారు. అసలు ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అని ప్రశ్నించారు. కార్పొరేట్ వ్యాపారస్తుల అవినీతి అక్రమాలు నిరోధించేలా కేంద్రం ఎందుకు వ్యవహరించలేకపోతుందన్నారు. ఈ విషయంలో ప్రజలకు కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. సమాధానం చెప్పకపోతే అవినీతిలో వారు కూడా భాగస్వాములేనన్నారు. జాతీయత ముసుగులో జాతి సంపదను కార్పోరేట్లకు ధారా దత్తం చేయడాన్ని తప్పుబట్టారు. అదానిపై సమగ్ర విచారణ జరిపి ఆర్థిక నేరాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదానీ ఆస్తులను జాతీయం చేసి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు, జాతీయ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు కే వి ఎన్ మూర్తి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్, కొప్పోజు సూర్యనారాయణ, యల్లావుల రమేష్, దొంతగాని సత్యనారాయణ, జక్కుల రమేష్, సుందరి పద్మ, జడ వెంకన్న, చెన్నగాని సైదులు, చక్రాల స్టాలిన్, కుడి తొట్టి స్వామి, కొట్టు మోహన్ రావు, లక్ష్మయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు.




