Wednesday, 4 November 2026

విద్యుత్ కోతలను నిరసిస్తూ ధర్నా

 

 

 

 

 

 

 

జనం సాక్షి: కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి 13విద్యుత్ కోతల నిరశిస్తూ కిసాన్ సెల్ అధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతల వల్ల ఎండిపోతున్న పంటలకు సాగునీరు అందించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరియు రాష్ట్ర కిసాన్ సెల్ ఆదేశాల మేరకు నేడు వనపర్తి జిల్లా కేంద్రంలో కరెంట్ ఆఫీస్ ముందు కిసాన్ సెల్ అధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ కార్యదర్శి,టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మెన్,మాజీ మంత్రి వర్యులు డా.జిల్లేల చిన్నారెడ్డి మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ గారు వహించడం జరిగింది.ఈ సందర్భంగా రంగినేని అభిలాష్ రావు గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని మాయమాటలు చెప్పి మోసం చేస్తుందని మండిపడ్డారు.యాసంగి సీజన్ లో భాగంగా మొక్కజొన్న, వరి, కూరగాయల పంటలు సాగు చేశామని,విద్యుత్ సరఫరా నిలిపేయడంతో పంట చేతికొచ్చే సమయంలో నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట దిగుబడికి పెట్టిన పెట్టుబడి ఖర్చు వృథా అవుతోందని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ గొప్పగా చెబుతున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు.డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత 24 గంటల కరెంటు మరియు ప్రతి ఏకారకి నీరు అందిస్తామని గొప్ప ప్రగల్బాలు పలికిన కేసిఆర్ మాటలు మరొక్క సారి నమ్మి మోసపోతే మనం బ్రతకడానికి కూడా ఏమి ఉండదన్నారు.రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.