Thursday, 5 November 2026

జాతీయ స్థాయి అవార్డ్ అందుకోబోతున్న ప్రముఖ సమాజ సేవకుడు ఈదునూరి రమేష్

జాతీయ స్థాయి అవార్డ్ అందుకోబోతున్న ప్రముఖ సమాజ సేవకుడు ఈదునూరి రమేష్

జనం సాక్షి, చేన్నరావు పేట

ఈ నెల 11, 12 తేదీలలో డిల్లీలో – భారతీయ దళిత్ సాహిత్య అకాడమీ – ఆధ్వర్యంలో బాబా సాహెబ్ డాక్టర్ అంబేత్కర్ నేషనల్ ఫెల్లోషిప్ అవార్డ్ 2022 కి ఎంపికైన నేక్కొండ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ సమాజ సేవకుడు ఈదునూరి రమేష్.ఈ సంద్భంగా భారతీయ దళిత్ సాహిత్య అకాడమీ దక్షణాది రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ జితేందర్ మాను మాట్లాడుతూ రమేష్ తన విద్యార్థి దశ నుండి గత 18 సంత్సరాలుగా ఈ సమాజానికి ఎనలేని సేవలు అందిస్తు ముందుకు సాగుతున్నాడు,విద్యార్థులను ఎన్నో విధాలుగా చదువు పైన, క్రీడల పైన, క్రమశిక్షణతో కూడిన నడవడికల పైన ఆసక్తి కలిగేలా పలు కార్యక్రమాలు చేస్తూ మదర్ థెరిస్సా యూత్ ఏర్పాటు చేసి విధ్యార్థులకు నోట్ బుక్స్, పెన్స్, పేద విద్యార్థులకు బట్టలు, బ్యాగ్స్ తదితర వస్తువులు పంపిణీ చేసి బాలల హక్కుల చట్టం, బాలికల హక్కుల రక్షణ చట్టం, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, బాలికల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, చైల్డ్ రైట్స్ 1098 లాంటి అంశాల పైన అవాహన కార్యక్రమాలు నిర్వహిస్తు మహిళలకు వారి హక్కుల పైన అవాగహన కల్పిస్తూ వారికి చాలా రకాల చేతివృత్తుల పైన శిక్షణ కార్యక్రమాలు చేస్తూ వారిని ఆర్ధిక అభివృద్ధి వైపు అడుగులు వేపిస్తున్న మహోత్తర కార్యాదిక్షుడు,కరోనా సమయంలో రమేష్ చేసిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్ రాష్ట్ర స్థాయి ఉత్తమ సమాజ సేవకుడి అవార్డ్ ఇవ్వడం జరిగిందనీ,రమేష్ ఆపదలో ఉన్న ఎంతో మందికి రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడాడు మరియు రకరకాల సందర్బాల్లో ఎంతో మందినీ ప్రోత్సహించి వారిచేత రక్తదానం చేపించి మరెంతో మందికి ప్రాణ దాత అయ్యాడు.పర్యావరణ పరిరక్షణ కోసం, భవిష్యత్ తరాలకు బంగారు కానుక ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా ఎనలేని కృషితో వందలాది మొక్కలు నాటడమే కాకుండా విద్యార్థులతో, మహిళలతో, యువకులతో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాలు చాలా చేశాడు.రైతులకు, కార్మికులకు వెన్నంటే ఉంటు వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ వారి క్షేమం కోసం పలు రకాల అంశాల పైన అవాగాహనతో పాటు జాగ్రత్తల పైన పూర్తిగా వివరిస్తూ, నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి రంగాల వైపు పయనించేల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి బాసటగా నిలబడిన వ్యక్తి. మారుమూల గ్రామాల ప్రజలకు ఆహారం, ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్తలు పాటించే విధంగా ఎనలేని అవాగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం లాంటి విలువైన కార్యక్రమాలు చేస్తున్నాడు.నేటి సమాజంలో రమేష్ నిరు పేదలకు మానవత్వంతో చేదోడు వాదోడుగా ఉంటూ వారికి కావలసిన నిత్యావసర వస్తువులను పెద్దల సహకారం తీసుకుంటూ పేదలకు అందజేయడం మనవాత్వానుకి నిలువుటద్దం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న రమేష్ ని తన సేవా గుణాన్ని గుర్తించి ఈ అవకాశం కల్పించి ప్రోత్సహించడం నా బాధ్యత అని జితేందర్ మాను అన్నారు.చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి నాకు ఇంతటి గొప్ప అవార్డ్ కు ఎంపిక చేసిన డాక్టర్ జితేందర్ మాను గారికి హృదయ పూర్వక కతజ్ఞతలు తెలుపుకుంటున్నానని రమేష్ అన్నారు.