Thursday, 5 November 2026

నేలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత హుజూర్ నగర్

నేలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత హుజూర్ నగర్ డిసెంబర్ 5 (జనంసాక్షి): నేలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హుజూర్ నగర్ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అన్నారు. మండలంలోని బూరుగడ్డ (మాచవరం) రైతు వేదిక నందు ప్రపంచ మృత్తికా దినోత్సవం సోమవారం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు పచ్చిరొట్ట ఎరువులు వాడి రసాయనిక ఎరువులు తగ్గించాలని వారు సూచించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి స్వర్ణ మాట్లాడుతూ మట్టి నమూనా సేకరణ విధానం, నేల సంరక్షణలో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి రైతులకు క్లుప్తంగా వివరించారు. తదనంతరం నేల సంరక్షణ గురించి రైతులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బూరుగడ్డ సర్పంచ్ షేక్ సలీమారంజాన్, కరకాయల గూడెం సర్పంచ్ , గోపాలపురం సర్పంచ్ శాసనాల నాగ సైదయ్య, కరక్కాయల గూడెం ఎంపీటీసీ, రైతు సమన్వయ సమితి మాచవరం అధ్యక్షుడు మాడుగుల పరుశురాం, ఏఈఓ నరేష్ గౌడ్, రైతులు పాల్గొన్నారు.