హైదరాబాద్,(జనంసాక్షి): మంత్రి జానారెడ్డిని బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య కలిశారు. పంచాయితీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని వినతి పత్రం సమర్పించారు. తగ్గిన 415 పంచాయితీలను బీసీలకు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు. బీసీలకు ఒక్క పంచాయితీ తగ్గిన ఊరుకోమని తేల్చిచెప్పారు.




