హైదరాబాద్: జానారెడ్డి వ్యాఖ్యలతో ఆను ఏకీభవిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సభ్యులు సభకు సహకరించాలని ఆయన కోరారు. సభ్యులు అసహనాకి గురికావద్దని, తప్పు చేస్తే నిలదీయాలని సూచించారు. అయితే ఆరోపణలు వద్దన్నారు. అంతకుముందు జానారెడ్డి మాట్లాడుతూ మంత్రులు ఉద్వేగంగా మాట్లాడడం తగదన్నారు. అధికార దర్పంతో మాట్లాడడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికార, విపక్ష సభ్యులు ఆవేశపూరితంగా మాట్లాడడం సరికాదన్నారు. సభలో వీధి రౌడీల్లా కొట్టుకుందామా అని ఆవేదన వ్యక్తం చేశారు. సభలో జగదీశ్వర్ రెడ్డి నీయవ్వ అనలేదా అని ప్రశ్నించారు. అరుణ కూడా ఆవేశంగా మాట్లాడారని జానారెడ్డి అన్నారు. జానా వ్యాఖ్యలకు స్పందించిన సీఎం కేసీఆర్ ఆయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్టు చెప్పారు. అనంతరం సభ 15 నిమిషాలు వాయిదా పడింది.




