Wednesday, 4 November 2026

జానీగాని తండా గ్రామపంచాయతీ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

జానీగాని తండా గ్రామపంచాయతీ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి డిసెంబర్ 3 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని శనివారం నాడు జానిగాని తండ గ్రామపంచాయతీ అంగన్వాడీ కేంద్రాన్ని కొండమల్లేపల్లి ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి పరిశీలించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలోని బాలబాలికలకు గర్భవతులకు ముఖ్యంగా పేదవారి పిల్లలకు పేద మధ్యతరగతి మహిళలకు పుష్టికరమైన ఆహారము సంపూర్ణమైన ఆహారం అందించాలన్న ఉద్దేశంతో అంగన్వాడీ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు అందిస్తున్న పోషకాహారం గురించి, బాలింతలకు అందిస్తున్న బాలామృతం గురించి తదితర అంశంలపై అడిగి తెలుసుకున్నారు. వాతావరణం చల్లగా ఉండటం వల్ల రోడ్డు పక్కన విశాల ప్రదేశంలో అంగన్వాడి కేంద్రం ఉండడంతో పాములు ఇతరత్రా విషజీవులు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశుభ్రతను పాటించాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ నీల, యూత్ కాంగ్రెస్ నాయకులు మంగ్య నాయక్,విద్యార్ధి సంఘాల నాయకులు ఎండీ .ఖదీర్, రామవత్ సేవ నాయక్ పలువురు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.