లేవేలింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, కార్పొరేటర్
మల్లాపూర్ డివిజన్ పరిధిలోని, గ్రీన్ హిల్స్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనుల నాణ్యతా ప్రమాణాలు , లేవేలింగ్ పనులను స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి పరిశీలించిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. అనంతరం స్థానిక కాలనీ వాసులు భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ బాక్స్ డ్రైన్ వద్ద లెవెలింగ్ సరిగ్గా లేకపోవడంతో నిత్యం మురుగు నీరు నిలిచిపోయి, పొంగుతున్నదని ఇట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరిన స్థానిక వాసులు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డి.ఈ రూపా, ఏ.ఈ శ్రావంతి, వర్క్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, స్థానిక నాయకులు కుంటి కృష్ణ, తండా వాసుగౌడ్, రంగారెడ్డి, సుశీల, సనాల రవి, గారికి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.