“నగర్ రూరల్:(జనం సాక్షి) 04 ఏప్రిల్ 2023’టైమ్స్ ప్రో వారి సహకారంతో ఐసిఐసిఐ బ్యాంకులలో రిలేషన్ షిప్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ నిమిత్తం మంగళవారం కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి.లక్ష్మినరసింహం తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ త్వరలో మరి కొన్ని కంపెనీల సహాయంతో జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.టైమ్స్ ప్రో ప్రతినిధి కుమార్ మాట్లాడుతూ టైమ్స్ ప్రో సంస్థ ద్వారా ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ జాబ్ మేళాకు 40 మంది హాజరు కాగా వీరికి తొలి దశ పరీక్ష నిర్వహించడం జరిగింది.తదుపరి దశను ఆన్ లైన్ ద్వారా నిర్వహించి ఎంపికైన వారికి నియామక పత్రాలను ఇవ్వనున్నట్లు ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో టైమ్స్ ప్రో ప్రతినిధి ప్రణయ్,అధ్యాపకులు ఎం.రాజేశ్వర్,వి.దేవేందర్,ఇ.శారద పాల్గొన్నారు.
జాబ్ మేళాకు స్పందన””జాబ్ మేళాకు స్పందన” కాగజ్




