Tuesday, 3 November 2026

ఏకలవ్య మోడల్ పాఠశాలలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్

ఏకలవ్య మోడల్ పాఠశాలలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ఏ

కొత్తగూడ ఏప్రిల్ 4 జనంసాక్షి:రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలలో 2023 – 24 సంవత్సరానికి గాను ప్రవేక్ష పరీక్షకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కొత్తగూడ ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బి.హేమంత్ ఒక ప్రకటనతో తెలిపారు.6 వ తరగతిలో 60 సీట్లకు, 7,8,9 వ తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని తెలపడం జరిగింది.ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈనెల 20 వరకు ఉందని అదేవిధంగా మే 27 న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారని తెలపడం జరిగింది.ఏకలవ్య పాఠశాలలో విద్యాబోధన అంతా ఇంగ్లీష్ మీడియం,సీబీఎస్సీ సిలబస్ ఉంటుందని,పుస్తకాలు,నోటుపుస్తకాలు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది.వీటితో పాటుగా హాస్టల్ వసతి కలదని తెలియజేశారు.చదువుతో పాటు అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింస్తామని తెలిపారు.విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.