.
మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 27ఈనెల 29న మల్కాజిగిరి లక్ష్మీ సాయి గార్డెన్ లో నిర్వహించే ఎన్నారై జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కోరారు.గురువారం ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. స్వావలంబీ భారత్ అభియాన్ మరియు నారపరాజు సావిత్రి ఫౌండేషన్ మరియు బిఎస్ఎస్ఎఫ్ మరియు అన్నావజ్జుల చారిటబుల్ ట్రస్ట్, హైర్ ది బెస్ట్ బ్రెయిన్ సంస్థల సౌజన్యంతో ఈనెల 28 శుక్రవారం 8 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినా వారితోపాటు ఇంటర్ డిగ్రీ పీజీ టెక్నికల్ ఇంజనీర్ వరకు చదువుకున్న వారికి ఐటిఐ,నాన్ ఐటి, ఫార్మా,విద్యారంగం,తయారీ,హోటల్ మేనేజ్మెంట్ తదితర ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామన్నారు. ఎంట్రీ ఫీజు లేదన్నారు. భోజన వసతి ఏర్పాటు చేశామని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినయోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 8978405740.ఫోన్ నెంబర్లు సంప్రదించాలని సూచించారు.




