యాదాద్రి భువనగిరి జిల్లా జనం సాక్షి న్యూస్ ఏప్రిల్ 27తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి, జెతిరామ్ తండా, చొక్ల తండా, పెద్దతండా, రుస్తాపూర్, మోతిరామ్ తండా, రామోజీనాయక్ తండా,వివిధ గ్రామాల్లో మొత్తం 30 కల్యాణ లక్ష్మి పథకం కింద మంజూరైనా చెక్కులను ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తుర్కపల్లి ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ భీకు నాయక్ స్వయంగా గ్రామాల్లో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు…. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసి లు ,బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పిన్నపు రెడ్డి నరేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కోమిరిశెట్టి నర్సింహులు, వంకరి ప్రసాద్, బానోత్ భాస్కర్ నాయక్,మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ జాహింగీర్,మరియు నాయకులు, గ్రామస్తులు,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు…




