Thursday, 5 November 2026

జియాఖాన్‌ ప్రియుడికి జ్యూడిషియల్‌ కస్టడీ

ముంబై,(జనంసాక్షి): బాలీవుడ్‌ నటి జియాఖాన్‌ ఆత్మహత్య కేసులో అరెస్టయిన ఆమె స్నేహితుడు , ప్రముఖ నటుడు ఆదిత్య పంచోలీ తనయుడు సూరజ్‌ పంచోలీకి స్థానిక కోర్టు ఈ నెల 27 వరకు జ్యడీషియల్‌ కస్టడీ విదించింది. నిన్నటి వరకు అతడికి విధించిన పోలీసు కస్టడీని పొడిగించాలన్నా ప్రాసిక్యూషన్‌ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
జియాను ఆత్మహత్య కు ప్రేరేపించాడనే ఆరోపణపై సూరజ్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన జియాఖాన్‌ రాసిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా సూరజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *