జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఓటర్లకు వాలెట్ యూనిట్ దివి ప్యాడ్ లపై అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ రూరల్ జూలై 10 జనం సాక్షి
జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలోని అన్ని గ్రామాలలో ఓటర్లకు బ్యాలెట్ యూనిట్, వివి ప్యాడ్, కంట్రోల్ యూనిట్లపై ఈరోజు నుండి అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రదర్శన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటింగ్ యంత్రాలపై ఓటర్లకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలోని ఆర్. ఓ కార్యాలయాలలో లేదా తహసిల్దార్ కార్యాలయాలతో పాటు కలెక్టర్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రదర్శన కేంద్రాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అలాగే నాలుగు నియోజకవర్గాలలోని అన్ని గ్రామాలలో మొబైల్ వ్యాన్ ల ద్వారా రోజు రెండు గ్రామాల చెప్పన ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ప్రతి నియోజకవర్గానికి నాలుగు మొబైల్ వాహనాల చొప్పున ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పోలింగ్ రోజు ఏ విధంగా ఓటు వేయాలో అనే అంశంపై మాక్ పోలింగ్ నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఓటర్లు ఇట్టి కేంద్రాల ద్వారా అవగాహన పెంచుకోవాలని సూచించారు. దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లపై బ్రెయిలీ లిపి పొందుపరచడం జరిగిందన్నారు. జిల్లా మొత్తంలో 21 ఈవీఎం ల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ లతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 6 గంటల వరకు రెండు షిఫ్టులలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఓటర్లకు అవగాహన కల్పించి మాక్ పోలింగ్ నిర్వహించాలన్నారు. ప్రతిరోజు సాయంత్రం సమీప పోలీస్ స్టేషన్ లో ఓటింగ్ యంత్రాలను భద్ర పరచాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా కేటాయించిన వాహనాలలో మాత్రమే ఓటింగ్ యంత్రాలను తీసుకుని వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) లింగ్యా నాయక్, వికారాబాద్ ఆర్డీవో విజయ కుమారి, తహసీల్దార్ రాజేందర్ రెడ్డి, ఎలక్షన్ డి టి రవీందర్ దత్తు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు