నిర్భయంగా ఫిర్యాదు చేయండి -జిల్లా ఎస్పీ కె.సృజన.

గద్వాల నడిగడ్డ, జులై 10(జనం సాక్షి);

సమస్య ఏదైనా ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ కె. సృజన అన్నారు.
సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 12 మంది బాధితుల నుంచి ఎస్పి ఫిర్యాదులను స్వికరించి, వాటిని పరిశీలించి, సంబంధిత పోలీసు అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిధిలోని సమస్యలను పరిష్కరించడానికి పోలీసు శాఖ ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు. ప్రజలు తమ సమస్యలు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలని, లేదా ఆపదలో ఉంటే స్థానిక పోలీసులకు గానీ, డయల్ – 100 కు గానీ ఫోన్ చేసి సమస్య తెలపాలని, సమస్యలపై చట్ట పరంగా తగిన చర్యలు ఉంటాయని ఎస్పి పేర్కొన్నారు.

తాజావార్తలు