Wednesday, 4 November 2026

జిల్లాలో 65ఉన్నత పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతికతో డిజిటల్ తరగతి గదులు డీఈఓ గోవిందరాజులు

నాగర్ కర్నూల్ ఆర్సీజూన్13(జనంసాక్షి):శాస్త్ర,సాంకేతిక రంగాల్లో సాధించిన పురోగతి సమాజంలోని అట్టుడుగునవున్న వారికి ఉపయోగపడినప్పుడే సార్థకత అని డీఈవో గోవిందరాజులు అన్నారు.మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాగర్ కర్నూల్ జిల్లాలోని 65ఉన్నత పాఠశాలలకు మొదటి విడత డిజిటల్ పాఠాలు బోధించేలా 79ఇంచుల అత్యాధునిక టీవీలను సమకూర్చిందన్నారు.ఒక్కో టీవీ కి 5లక్షల రూపాయలతోప్రభుత్వంఏర్పాటుచేసిందన్నారు.మంగళవారం బిజినపల్లి మండలంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల బిజినపల్లి పాలెం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ టీవీలను డీఈఓ గోవిందరాజులు పరిశీలించారు.అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేసి,ఏకరూప దుస్తులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ నుండి డిజిటల్ తరగతి గదులు అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలిపారు.సమాచార సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు నేటి సమాజానికి ఉపయోగపడడమే కాకుండా భావి తరాలను తీర్చిదిద్దడానికి ఉపయోగించుకోవాలనే విధాన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్నారు.కార్పొరేట్‌,ప్రైవేటు పాఠశాలలకే పరిమితమైన డిజిటల్‌ పాఠాలను ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు.కేబుల్‌ టివి ద్వారా పాఠశాలలో ఉన్న విద్యార్థులకు నూతన విధానంలో డిజిటల్ పాఠాలు అందుతాయి అన్నారు.పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఆయన సూచించారు.డిజిటల్ తరగతి గదుల భద్రతా తదితర వివరాలను ఉపాధ్యాయులతో అడిగి తెలుసుకున్నారు.మెరుగైన ఫలితాలు వచ్చేలా ప్రణాళిక బద్ధంగా తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆయన ఆదేశించారు.ఆయన వెంట ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారు.