Tuesday, 3 November 2026

-జిల్లాల్లో నాణ్యత లేని సీసీ రోడ్లు వేయకుండా చర్యలు తీసుకోవాలి – బిఎస్పీ

నాగర్ కర్నూల్ ఆర్సీ మార్చి04 (జనంసాక్షి):బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో జిల్లా ఎస్ఈ కి వినతి పత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి.కుమార్ మాట్లాడుతూ,పెద్దకొత్తపల్లి మండలం,జొన్నలబోగుడా గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాణ్యతలేని సీసీ రోడ్లు వేస్తున్నారని విమర్శించారు.అధికారం చేతిలో ఉందని,బిఆర్ఎస్ నాయకులు ఇష్టారీతిన నాణ్యత లేని రోడ్లు వేస్తే బిఎస్పీ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.సీసీ రోడ్లు వేసే అప్పుడు సమంధిత శాఖ అధికారి పర్యవేక్షణలో,నాణ్యత ప్రమాణాలు పాటించి రోడ్లు వేసేలా ఎస్ఈ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.జిల్లా ఎస్ఈ ఆకస్మిక తనీఖీలు చేసి,నాణ్యమైన సీసీ రోడ్లు వేయించి-ప్రజా ధనం వృధా కాకుండా అరికట్టాలనీ కోరారు.నాణ్యమైన రోడ్లు వేయమని అడిగితే,బిఆర్ఎస్ నాయకులు బిఎస్పీ నాయకులపై దాడి చేయడం సబబు కాదనీ తెలిపారు.ప్రజా సమస్యల పట్ల బిఎస్పీ పార్టీ నిరంతరం పోరాడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ అసెంబ్లీ ఇంచార్జ్ కేశపాగ.వెంకటేష్,నాగర్ అసెంబ్లీ అధ్యక్షులు పృథ్వీరాజ్,ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్,జొన్నల బోగుడ బిఎస్పీ నాయకులు విష్ణు,రాజశేఖర్,మల్లేష్,కురుమయ్య,శంకర్ లతో పాటు నాయకులు బాలు,నాగేష్,లక్ష్మణ్,రాంచందర్,శివకృష్ణ,రామకృష్ణ,నాగార్జున లు పాల్గొన్నారు.