Tuesday, 3 November 2026

.ప్రజల సొమ్ము దోచుకుంటుంది కేసీఆర్ ప్రభుత్వమే… బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకటరెడ్డి..

శంకరపట్నం: జనం సాక్షి మార్చి 4రాష్ట్రంలో 9 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న  కెసిఆర్ ప్రభుత్వం వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజల నుండి దోచుకుంటుందని, గ్యాస్ విషయంలో  రోడ్లపైకి వచ్చి బిఆర్ఎస్ నాయకులు ధర్నా చేయడం  దొంగే దొంగని అరిచినట్టుగా ఉందనిబీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. బి ఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఊరూరా డబుల్ బెడ్ రూం ఇండ్లు తెచ్చేందుకు,  దళితబందు ఇప్పించేందుకు ,రైతు రుణమాఫీ చేపించేందుకు, కరెంట్ బిల్లులు తగ్గించేందుకు  ,రిజిస్ట్రేషన్ చార్జీలు ఇంటిపన్నులు ,వెహికిల్ పెనాల్టీలు గ్రీన్ టాక్సీలు ,ఆర్టీసీ చార్జీలు ట్రాఫిక్ పెనాల్టీలు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించడం కోసం ప్రజల ప్రజలకు అండగా నిలిచి పోరాటం చేస్తే హర్షిస్తారన్నారు.  బిఆర్ఎస్ నాయకులకు దమ్ముంటే కేసీఆర్ నిరంకుశ , నియంతృత్వ విధానాలపై  పోరాడాలన్నారు. విదేశాల నుండి కొనుగోలు చేసే పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ పై అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ధరలను భారం కాకుండానే పెంచిందన్నారు.  పెంపుదలను బూచిగా చూపి  రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ పై  టాక్స్ లను పొంది లబ్ధి చెందుతూ,  ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయకుండా  , ఇట్టి విషయంలో కేంద్రం పై నెపం నెట్టి రాజకీయాలకు పొందాలనుకోవడం ముర్కత్వమన్నారు.