ఆదిలాబాద్,ఫిబ్రవరి26(జనంసాక్షి): జిల్లాలో క్యారమ్ పోటీలకు ప్రానిధ్యం పసెరుగుతోంది. అలాగే దీనిపై మక్కువ కూడా పెరుగుతోంది. ఇటీవల పలు ప్రాంతాల్లో యువత దీనిపై ఆసక్తి చూపుతోంది. దీనిని ఆధారం చేసుకుని బెల్లంపల్లి పట్టణంలోని సీఈఆర్ క్లబ్‌లో వచ్చే నెల 1న జిల్లాస్థాయి క్యారమ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్యారమ్ అసోసియేషన్ నాయకులు ప్రకటించారు. అండర్-12, అండర్-14 బాలబాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి1న ఉదయం 9 నుంచి సాయంత్రం 5వరకు పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో ఎంపికైన బాలబాలికలు 2, 3తేదీల్లో హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్‌శాస్త్రి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ పోటీల్లో గెలిచినవారిని 12 నుంచి 15వరకు మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఎంపిక చేస్తారన్నారు. పోటీల్లో పాల్గొనే బాలబాలికలు తమ పాఠశాలల నుంచి వయసు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలని కోరారు. ఆసక్తి కలిగిన వారు తమను సంప్రదించాలన్నారు.




