Wednesday, 4 November 2026

7న మాదిగ మహిళా ప్రదర్శన

వరంగల్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): ఎస్సీ వర్గీకరణ కోసం హన్మకొండలో మాది మహిళలతో భారీ ప్రదర్శనకు ఎమ్మార్పీఎస్‌ సిద్దం అవుతోంది. ఇరు రాష్టాల్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మార్చి 7న హన్మకొండ ఏకశిల పార్కు నుంచి అమరవీరుల స్తూపం వరకు మాదిగ మహిళల మహాప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. భారీగా మాదిగ మహిళలను సవిూకరించి మాదిగ శక్తి ప్రదర్శనకు దీనిని వేదికగా చేసుకోవాలని చూస్తున్నారు. దీనిద్వారా మరో పోరాటానికి ముందుకు సాగాలని నిర్ణయించారు. అలాగే  18న అసెంబ్లీ ముట్టడితో సత్తా చాటాలనుకుంటున్నారు.  ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో వర్గీకరణకు తాను అనుకూలమని, తనే పెద్దమాదిగను అవుతానని నమ్మబలికి ఇప్పుడు దాటవేట ధోరణితో వ్యవహరించడం సరికాదని ఇప్పటికే ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆయన మలిదశ ఉద్యమంలో భాగంగా ప్రతి జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలంగాణ, ఆంధప్రదేశ్‌ రెండు రాష్టాల్ల్రో ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి వర్గీకరణ సాధిస్తామన్న ధీమాలో మాదిగ నేతలు ఉన్నారు. 7న హన్మకొండలో జరిగే మహిళా ప్రదర్శనకు, 18న అసెంబ్లీ ముట్టడికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్‌ఆల్లో కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *