Wednesday, 4 November 2026

జిల్లా కలెక్టర్ కు,స్థానిక ఎమ్మెల్యేకు జిల్లా కేంద్రం లోని రోడ్ల దుస్థితి కనిపించడం లేదా

జిల్లా కలెక్టర్ కు,స్థానిక ఎమ్మెల్యేకు జిల్లా కేంద్రం లోని రోడ్ల దుస్థితి కనిపించడం లేదా?

ప్రజల బాధలను వినే ఓపిక లేదా?

ప్రజలు మీకు మనసులుగా కనిపించడం లేదా?

సిపిఎం సూటి ప్రశ్న.

ఫ్లైఓవర్ బ్రిడ్జి,బైపాస్ రోడ్డు వద్ద సిపిఎం రాస్తారోకో

మద్దతుగా నిలిసిన ప్రజా సంఘాలు.

మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ఫ్లైఓవర్ బ్రిడ్జి,బైపాస్, ఇస్లాంపూర్,ఇతర ప్రాంతాల్లో రోడ్లన్నీ ప్రమాదకరంగా ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్,స్థానిక ఎమ్మెల్యే ఆర్ అండ్ బి శాఖ,మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు.
వీరి నిర్లక్ష్యం మూలంగా ప్రజల,ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కుటుంబాలు వీధుల
పాలౌవుతున్నాయి.షాపులు,ఇండ్లు,దుమ్ము,ధూళితో నిందిపోతు ప్రజలు అనారోగ్యలకు గురౌతున్నారు.ఈ రోడ్ల దుస్థితి పై అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన పట్టించుకోవడం లేదు.
జిల్లా కేంద్రంలో ఉన్న రోడ్లపై కలెక్టర్,ఎమ్మెల్యే,ఇతర అధికారులు నడిచివెల్లితే తెలుస్తుంది ప్రజల బాధలు.
శాంతి యుతంగా నిరసన చెప్పడం కోసం రాస్తారోకో చేస్తే ప్రభుత్వం,అధికారులు నిర్భందం ప్రయోగిస్తుంది.
10 రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే పట్టణ దిగ్బంధ కార్యక్రమంకు పిలుపునివ్వడం జరుగుతుంది.
రాస్తారోకో అనంతరం మున్సిపల్ కమిషనర్ తో రోడ్ల సమస్యలపై సీపీఎం నాయకత్వం చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో

సంకే రవి సీపీఎం జిల్లా కార్యదర్శి,
గుమసా ప్రకాష్,దాసరి రాజేశ్వరి,
కనికరం అశోక్ సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు,
దుంపల రంజిత్ కుమార్,
దూలం శ్రీనివాస్,గుమసా అశోక్,దాగం రాజారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు,అబ్బజు రమణ,
ప్రేమ్ కుమార్ లు ఉన్నారు.