సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి,. మే 5 :సంగారెడ్డి జిల్లాకు బదిలీ పై వచ్చిన నూతన డిఈఓ వెంకటేశ్వర్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ను శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.వెంకటేశ్వర్లు మంచిర్యాల జిల్లా డిఈఓ గా పనిచేసి బదిలీపై సంగారెడ్డిజిల్లాకు వచ్చినట్లు తెలిపారు.శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారిగా వెంకటేశ్వర్లు బాధ్యతలను స్వీకరించారు.




